Tuesday, August 26, 2025

కూతుర్ని చంపి తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ లో ఓ తల్లి తన కూతురికి రేబిస్ వ్యాధి ఉందన్న అనుమానంతో కూతుర్ని చంపి తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూటన్ ప్రాంతానికి చెందిన యశోద కు మూడు సంవత్సరాల. కూతురు ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో కుక్కలకు సంబంధించిన రేబిస్ వ్యాధి వార్తలు ఎక్కువగా గమనించేది. ఈ క్రమంలో గత కొద్దిరోజుల క్రితం తన ఇంటి ఆవరణలో పల్లీలు ఆరబోసింది.. ఆ పల్లీలలో కుక్కలు తిన్నయన్న అనుమానంతో ఆమె మానసికంగా కృంగిపోయింది. గత కొంతకాలంగా మూడు సంవత్సరాల కూతురు అనారోగ్యం పాలవడంతో ఈ పల్లీల కుక్కలు తినడం వల్ల తన కూతురు అనారోగ్యానికి గురైందని భావించిన తల్లి మన వేదనకు గురి అయింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం కూతురికి రేబిస్ వ్యాధి వచ్చిందన్న అనుమానంతో కూతుర్ని చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి పేరు యశోద గా గుర్తించిన పోలీసులు వివరాలు రాబడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News