Thursday, September 18, 2025

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మహిళా నక్సలైట్ మృతి

- Advertisement -
- Advertisement -

తొమ్మిది సంఘటనల్లో కావలసిన మహిళా నక్సలైట్ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో గురువారం ఎన్‌కౌంటర్‌లో హతమైంది. ఆమెపై రూ. 5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గడిరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుప్డి, పెర్మా పారా గ్రామాల మధ్య ఉన్న అటవీ కొండపై ఉదయం కాల్పులు జరిగాయి. రాష్ట్ర పోలీస్ యూనిట్ అయిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డిఆర్‌జి) బృందం సోదా ఆపరేషన్ కోసం బయలుదేరిందని ఇక్కడి అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో నక్సలైట్లు సంచరిస్తున్నారన్న సమాచారం అందాక ఆపరేషన్‌ను ఆరంభించారు. ఎదురు కాల్పులు ఆగిపోయాక బుస్కి నుప్పో(35) అనే మహిళా నక్సలైట్ భౌతిక కాయం అక్కడ లభించిందని పోలీస్ అధికారి తెలిపారు. అంతేకాక 315 బోర్ రైఫిల్, ఐదు తూటాలు, ఒక వైర్‌లెస్ సెట్, ఎనిమిది డిటోనేటర్లు, పది మీటర్లు ఉన్న కార్డెక్స్ వైర్, నాలుగు జెలెటిన్ రాడ్లు, గన్‌పౌడర్, రేడియో, మావోయిస్టు సాహిత్యం, ఇతర వస్తువులు అక్కడ లభించాయని ఆయన వివరించారు.

Also Read: సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News