Friday, July 11, 2025

రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన మహిళా పోలీస్టేషన్ ఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్ ఎస్‌ఐ వేణుగోపాల్ ఎసిబికి చిక్కాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కేసు పరిష్కారం నిమిత్తం ఎస్‌ఐ వేణుగోపాల్ రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా ఎస్‌ఐ వేణుగోపాల్ పట్టుబడ్డాడు. సొమ్మును స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు ఎస్‌ఐ వేణుగోపాల్‌ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇటీవలి కాలంలో పోలీసు శాఖకు చెందిన వ్యక్తులు ఎసిబికి చిక్కుతుండటం తెలిసిందే. కాగా ఎసిబికి పట్టుబడ్డ ఎస్‌ఐ వేణుగోపాల్ ఈ మధ్యనే ప్రమోషన్‌లో భాగంగా గచ్చిబౌలి మహిళా పోలీసుస్టేషన్ ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News