అమరావతి: ఓ వివాహిత యువకుడిని తనతో సన్నిహితంగా ఉండకపోతే చచ్చిపోతానని బెదిరించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కృష్ణలంక ప్రాంతంలో ఓ వివాహిత తన భర్త పిల్లలతో కలిసి జీవిస్తోంది. కనకదుర్గ నగర్‌కు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కృష్ణలంక ప్రాంతంలో స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొనేవాడు. వివాహిత పలువురు యువకులతో కలిసి పార్టీలో పాల్గొనేది. సదరు యువకుడికి వివాహిత పరిచయం కావడంతో ఫోన్‌లో మాట్లాడుకునేవారు. వివాహిత యువకుడి ఇంటికి అతడి కుటుంబ సభ్యులను కూడా పరిచయం చేసుకుంది. యువకుడి ఫోన్‌కు ఇబ్బంది కలిగించే సందేశాలు పంపించింది. సందేశాలు శృతిమించడంతో పాటు అతడికి వివాహిత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో తనతో సన్నిహితంగా ఉండకపోతే చచ్చిపోతానని వివాహిత యువకుడిని బెదిరించింది. దీంతో యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరు ఫోన్లు చేసుకున్నా, సందేశాలు పంపించుకున్నా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించి ఇంటికి పంపించారు.
సన్నిహితంగా ఉండకపోతే చచ్చిపోతానని యువకుడిని బెదిరించిన మహిళ
- Advertisement -
- Advertisement -
- Advertisement -