Wednesday, May 14, 2025

తీవ్ర గాయాలతో 16 గంటలు చెట్ల పొదల్లో… అత్యాచారం?

- Advertisement -
- Advertisement -

అమరావతి: మహిళ 16 గంటల పాటు తీవ్ర గాయాలతో చెట్ల పొదల్లో స్పృహ తప్పిపడిపోయింది. ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానా వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సత్తెమ్మ తల్లి దేవాలయం సమీపంలో చెట్ల పొదల్లో పడిపోయింది. 16 గంటల తరువాత ఆమెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఆమె తలపై గాయాలున్నట్టు గుర్తించారు. ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళను గోసంగిపేటకు చెందిన వ్యక్తి సోమవారం రాత్రి తీసుకెళ్లి ఆమెపై దాడి చేయడంతో స్పృహతప్పిపోడిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News