Tuesday, August 12, 2025

మహిళల వరల్డ్‌కప్ కౌంట్‌డౌన్ షురూ..

- Advertisement -
- Advertisement -

భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు సంబంధించిన 50 రోజుల కౌంట్‌డౌన్ సోమవారం ముంబైలో ప్రారంభమైంది. సెప్టెంబర్ 30న ప్రారంభమయ్యే మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 2న జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగనుంది. ఇందులో భారత్‌తో సహా 8 జట్లు పోటీ పడనున్నాయి. కాగా, 11 లీగ్ మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. మిగిలిన మ్యాచ్‌లు భారత్‌లో జరుగుతాయి. మెగా టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టు ప్రత్యర్థి టీమ్‌తో ఓసారి తలపడనుంది. లీగ్ దశలో 28 మ్యాచ్‌లు జరుగనున్నాయి. లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్టు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్లో అక్టోబర్ 29న, రెండో సెమీస్ పోరు అక్టోబర్ 30న జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న నిర్వహిస్తారు. తొలి సెమీస్‌తో పాటు, ఫైనల్ వేదికను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

ఈ వరల్డ్‌కప్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేవ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతాయి. బెంగళూరులో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌కప్ తెరలేవనుంది. కాగా, మహిళల వరల్డ్‌కప్ 50 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని సోమవారం ముంబైలో నిర్వహించారు. దీనిలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్షుడు జై షా, బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌తో పాటు ప్రస్తుత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరల్డ్‌కప్ నిర్వహిణకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. ఐపిఎల్ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో అభిమానులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

ఇలాంటి స్థితిలో బెంగళూరులో ఆరంభ మ్యాచ్‌ను నిర్వహించాలా వద్దా అనే దానిపై కూడా చర్చించారు. ఒక వేళ బెంగళూరులో తొలి మ్యాచ్ జరగకపోతే దాన్ని ముంబైలోని వాంఖడే మ్యాచ్‌కు మార్చే అవకాశాలున్నాయి. మరోవైపు సొంత గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సుదీర్ఘకాలంగా జరుగుతున్న మెగా టోర్నమెంట్‌లో భారత్ ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేదు. కానీ ఈసారి ఆ లోటును పూడ్చుకోవాలనే పట్టుదలతో ఉంది. కొంతకాలంగా టీమిండియా నిలకడైన ఆటతో అలరిస్తోంది. దీంతో వరల్డ్‌కప్ గెలిచే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News