Friday, May 2, 2025

మరింత కష్టపడి పని చేయండి… జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: కష్టపడి పనిచేయడం ద్వారా రాష్ట్రంలోనే హైదారబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలని నూతన కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ జిల్లా అధికారులకు దిశ నిర్దేశం చేశారు. 2018 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన యువ ఐఎఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టి జిల్లా కలెక్టర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అదనపు కల్టెర్ వెంకటేశ్వర్లు నూతన కలెక్టర్‌కు పు ష్ప గుచ్ఛాలను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కష్టపడి చేయడం ద్వారా జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవలనుఅందించాలని సూచించారు.

అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాలను అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన కలెక్టర్‌ను జిల్లా వివిధ విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డి ఆర్ ఓ సూర్యలత, లా ఆఫీసర్ సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని తహసీల్దా ర్లు, కలెక్టరేట్ సిబ్బంది కలెక్టర్ ను కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News