Friday, August 15, 2025

బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నా: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తాం అని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి  (Revanth Reddy) కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో పనిచేయలేం అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. మెట్రో డిపిఆర్ గత వారమే కేంద్రానికి ఇచ్చారని, మెట్రో రైలు (Metro train) సాధ్యాసాధ్యాలపై కేంద్రం పరిశీలిస్తోందని తెలియజేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నానని, ఆదివారం సాయంత్రం బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక నోటీఫికేషన్ జరుగుతుందని, రేపు నామినేషన్, ఎల్లుండి ఎన్నిక ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News