హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపోర్లుతుున్నాయి. ఉత్తర తెలంగాణలో వాగులు, వంకలు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భారీ వరదలు సంభవించడంతో కొన్ని ప్రాంతాలలో రోడ్లు కొట్టుకపోయాయి. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో బొగ్గు గుడిసె వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జి నిర్మాణం కోసం పని చేస్తుండగా కార్మికుల వాగులో చిక్కుకపోయారు. వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి కాపాడాలని కార్మికుల ఆర్తనాదాలు చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తుండగా బొగ్గు గుడిసె వాగు వరదలో కార్మికులు చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని బయటకు ప్రయత్నాలు చేస్తున్నారు.
భారీ వర్షం కురవడంతో వరదలు ముంచెత్తడంతో కామారెడ్డి – ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డు కొట్టుకపోయింది. వర్షం 15 గంటలుగా ఏకధాటిగా కురువడంతో వరదలు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వర్షానికి రోడ్డు కొట్టుకుపోవడంతో లింగంపేట్ – ఎల్లారెడ్డి -కామారెడ్డి మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి.