- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) విమర్శించారు. తాను బిఆర్ ఎస్ బలోపేతం కోసమే పని చేస్తున్నానని కవిత అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడు అన్నిబయటకు వస్తాయని చెప్పారు. సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రజల అభిప్రాయాల మేరకే ప్రస్తావించానని తెలిపారు. ఆరు నెలల్లో జైల్లో ఉన్నది సరిపోదా? ఇంకా కష్టపెడతారా? నని ప్రశ్నించారు. తనను రెచ్చగొట్ట వద్దని, రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తానని హెచ్చరించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై పార్టీ స్పందించాలని కవిత కోరారు.
- Advertisement -