టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఈటెను 84.82 మీటర్ల దూరంలో విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ కోసం నిర్దేశించిన 84.50 మీటర్ల మార్క్‌ను నీరజ్ అలవోకగా అందుకున్నాడు. దీంతో అతను మొదటి ప్రయత్నంలోనే ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగే ఫైనల్లో నీరజ్ స్వర్ణం కోసం పోటీపడనున్నాడు.
పోలండ్ అథ్లెట్ డేవిడ్ వెంగర్, జర్మన్ స్టార్ జులియన్ వెబర్ తదితరులు కూడా ఫైనల్‌కు అర్హత సాధించారు. అంతేగాక పాకిస్థాన్ స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్, గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్, అమెరికా స్టార్ కుర్టిస్ థాంప్సన్, కెన్యా అథ్లెట్ జులియస్ యెగోలు కూడా ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఇక గురువారం జరిగే ఫైనల్లో నీరజ్, నదీమ్, పీటర్స్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే ఈసారి నీరజ్ చోప్రా స్వర్ణం సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.