న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్‌తో (Operation Sindoor) ఉగ్రవాదానికి ధీటైన జవాబు ఇచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఆపరేషన్ సింధూర్‌పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులతో విరుచుపడ్డామని అన్నారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరిగాయని.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్థానే అని ప్రపంచమంతా తెలుసు అని పేర్కొన్నారు. పాకిస్థాన్ కూడా ఉగ్రవాద పోషకులుగా నిరూపించుకుంది అని తెలిపారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ని (Operation Sindoor) ప్రపంచమంతా కొనియాడిందని.. సరిహద్దులను రక్షిస్తున్న జవాన్లకు సెల్యూట్ చేస్తున్నట్లు షా (Amit Shah) పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న పహల్‌గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్‌పై భారత వాయుసేన విరుచుకుపడింది. ముందుగానే పాక్‌లో ఉండే ఉగ్రస్థావరాలను గుర్తించి వాటిపై దాడి చేసింది. ఈ క్రమంలో భారత్ – పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో వాతావరణం ప్రశాంతంగా మారింది.