- Advertisement -
లండన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో బుధవారం తొలి రోజు బౌలర్ల హవా కొనసాగింది. మొదటి రోజు ఏకం గా 14 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ లబుషేన్ (17) కూడా నిరాశ పరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కామెరూన్ గ్రీన్ (4) కూడా విఫలమయ్యాడు.
ట్రావిస్ హెడ్ (11) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. కానీ స్టీవ్ స్మిత్ 10 ఫోర్లతో 66 పరుగులు చేసి జట్టును ఆదుకున్నా డు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బియు వెబ్‌స్టర్ 11 ఫోర్లతో 72 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా ఐదు, జాన్స న్ మూడు వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 22 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసి కష్టాల్లో చిక్కుకుంది.
- Advertisement -