- Advertisement -
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో చిరస్మరణీయ శతకం సాధించిన దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్పై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ టెస్టు చరిత్రలోనే ఈ ఇన్నింగ్స్ చిరకాలంగా గుర్తుండి పోతుందన్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ మార్క్రమ్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచాడన్నాడు. ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడడం అందరికీ సాధ్యం కాదన్నాడు. తాను చూసిన అద్భుత ఇన్నింగ్స్‌లలో ఇది చాలా ప్రత్యేకమైందని పాంటింగ్ వివరించాడు.
- Advertisement -