- Advertisement -
సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖలేజా (Khaleja) చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రీ -రిలీజ్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, (Superstar Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఖలేజా ప్రీ సేల్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఖలేజా నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కళ్యాణ్, కృష్ణ సోదరులు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు, కమెడియన్ అలీ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు.
- Advertisement -