Friday, July 4, 2025

కన్సార్టియంతో కలిసిన ADoBE 2025ను నిర్వహించిన వోక్సెన్ వర్సిటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ భాగస్వాముల కన్సార్టియంతో కలిసి వోక్సెన్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ADoBE’2025 ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ఆఫ్ బిల్ట్ ఎన్విరాన్‌మెంట్ కోసం ప్రీ-ఈవెంట్‌ను నిర్వహించింది . హైదరాబాద్ లోని చారిత్రాత్మక నీటి వ్యవస్థలు (“ది హిస్టారిక్ వాటర్ సిస్టమ్స్ ఆఫ్ హైదరాబాద్”) శీర్షికతో నిర్వహిస్తోన్న ఈ హైబ్రిడ్-ఫార్మాట్ కార్యక్రమం ADoBE’2025 ప్రారంభ బిందువుగా పనిచేస్తోంది. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) చీఫ్ ఇంజనీర్ కె. సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కావటంతో పాటుగా విధాన పరమైన జోక్యాలపై ఆధారపడిన అంశాలను వెల్లడించారు. నదులు, చెరువుల పునరుజ్జీవనంలో బహుళ-భాగస్వాముల పాత్రను నొక్కి చెప్పారు. హైదరాబాద్ యొక్క మారుతున్న ప్రకృతి దృశ్యాన్ని గురించి వెల్లడిస్తూ, “హైదరాబాద్‌లో ఒకప్పుడు దాదాపు 500 చెరువులు ఉండేవి, ఇప్పుడు దాదాపు 185 చెరువులు మిగిలి ఉన్నాయి. ఈ చెరువులను పునరుద్ధరించడం మరియు మెరుగుపరచడం కోసం ఆలోచనలను అన్వేషించడానికి ఈ వర్క్‌షాప్ ఒక గొప్ప అవకాశం” అని అన్నారు.

ఈ సమావేశానికి అనుబంధంగా, జిఎస్వి సూర్యనారాయణ మూర్తి చేసిన పరిరక్షణ ప్రయత్నాలు, వోక్సెన్ విశ్వవిద్యాలయ విద్యార్థులచే నిర్వహించబడిన నిర్మాణాత్మక థీసిస్ ప్రాజెక్టుల ప్రదర్శన కూడా జరిగింది. “పచ్చని నగరాలు బూడిద రంగు పులుముకుంటున్న కాలంలో మనం జీవిస్తున్నాము, స్మార్ట్ సిటీలు వర్షాకాలంలో తరచుగా విఫలమయ్యే ఐఓటి వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి. పట్టణ గృహాలు కుంచించుకుపోతున్న వేళ, గ్రామీణ ప్రాంతాలు విస్తరిస్తుండగా మనం పురోగతి గురించి మాట్లాడుతున్నాము ” అని వోక్సెన్ విశ్వవిద్యాలయం సీఈఓ విశాల్ ఖుర్మా అన్నారు.

జర్మనీలోని రీజెన్స్‌బర్గ్ నగరంలోని వరల్డ్ హెరిటేజ్ కోఆర్డినేటర్, వోక్సెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ అనుబంధ ప్రొఫెసర్ మథియాస్ రిప్, చరిత్రకారుడు, కాలమిస్ట్ సజ్జాద్ షాహిద్; ICOMOS ఇండియాలోని సౌత్ జోన్ ప్రతినిధి GSV సూర్యనారాయణ మూర్తి, ADAPT టెక్నాలజీస్‌లోని అర్బన్ ప్లానర్, డైరెక్టర్ మహీప్ సింగ్ థాపర్, ధృవంశ్ NGO వ్యవస్థాపకురాలు మధులిక చౌదరి ఈ సదస్సులో పాల్గొన్నారు. వోక్సెన్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డాక్టర్ రౌల్ వి. రోడ్రిగ్జ్ మాట్లాడుతూ , ADoBE వంటి కార్యక్రమాలు వ్యవస్థల స్థాయి ఆలోచనను రేకెత్తించడానికి, పర్యావరణ అనుకూల అభివృద్ధిలో కార్యాచరణ మార్గాలను ప్రోత్సహించటానికి ప్రతీకగా ఉంటాయన్నారు. స్కూల్ అఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డీన్ సోనియా గుప్తా మాట్లాడుతూ..” ADoBE ప్లాట్‌ఫామ్ అనేది డిజైన్ విద్యను విచారణ, ప్రచారం, ప్రభావం సమ్మేళనంలో ఒక వ్యూహాత్మక ప్రతిపాదన” అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News