Wednesday, September 3, 2025

ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్న యమునా నది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వజీరాబాద్, హుత్నికుండ్ బ్యారేజీల నుండి అధిక పరిమాణంలో నీరు విడుదల కావడంతో, ఢిల్లీలోని యమునా నది ఈ సంవత్సరం తొలిసారి ‘ఎవాక్యుయేషన్ మార్క్’ (తరలింపు మార్క్‌ను) దాటింది. దాని ఒడ్డున ఉన్న అనేక లోతట్టు ప్రాంతాలలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. కాగా ప్రభుత్వం పూర్తి సంసిద్ధంగా ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అన్నారు. ఆమె యమునా నది పరిసర ప్రాంతాలను సందర్శించి చూశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద నీటి మట్టం 206.03 మీటర్లుగా నమోదయింది. దీనితో ట్రాఫిక్‌ను మూసేశారు. ఉదయం 6 గంటలకు యమునా నది ప్రమాద స్థాయి 205.33 మీటర్ల కంటే ఎక్కువగా 205.68 మీటర్లకు చేరుకుంది. నీటి మట్టం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలను జిల్లా అధికారులు తరలిస్తున్నారు. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జిని తాత్కాలికంగా మూసేశారు. ఉత్తరాదిలో అనేక రాష్ట్రాలలో విపరీతంగా వర్షం కురుస్తున్నందున వరద, కొండచరియలు విరిగిపడ్డం వంటి విపత్తులు చోటుచేసుకుంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News