Sunday, June 22, 2025

యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న ఓ రికార్డును యశస్వి తిరగ రాశాడు. శుక్రవారం తొలి రోజు ఆటలో యశస్వి చిరస్మరణీయ శతకం సాధించాడు. ఈ క్రమంలో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్ టీమ్‌పై బ్రాడ్‌మన్ 89.78 సగటుతో 5,028 పరుగులను సాధించాడు. అయితే జైస్వాల్ ఈ రికార్డును చెరిపేశాడు. ఇంగ్లండ్‌పై ఇప్పటి వరకు ఆడిన 10 ఇన్నింగ్స్‌లలో యశస్వి 90.33 సగటుతో 813 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్‌పై 90 ప్లస్ యావరేజ్ కలిగిన ఏకైక బ్యాటర్‌గా యశస్వి నయా రికార్డును సృష్టించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News