లీడ్స్: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్ అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. అజేయ శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి భారత్‌కు మంచి ఆరంభం లభించింది. తొలి వికెట్‌కి జైస్వాల్.. 91 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. మొదటి వికెట్‌గా రాహుల్ పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన సాయి సుదర్శన్ పరుగు చేయకుండానే ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, యశస్వీ జైస్వాల్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.
తొలుత ఈ మ్యాచ్‌లో జైస్వాల్ అర్థ శతకం సాధించగా.. ఆ తర్వాత గిల్ 56 బంతుల్లో అర్థశతకం సాధించాడు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 100+ పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అనంతరం జైస్వాల్ తన బ్యాటింగ్‌లో కాస్త వేగం పెంచాడు. 144 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సుతో శతకం సాధించాడు. ప్రస్తుతం టీ బ్రేక్ సమయానికి 51 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజ్‌లో జైస్వాల్ (100), గిల్ (58) ఉన్నారు.