విజయవాడ: గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసిపికి ఆ పార్టీ నాయకులు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వైసిపికి షాక్ తగిలింది. బుధవారం మరో నేత రాజీనామా చేశారు. ఎపి శాసన మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ జకియా ఖానం రాజీనామా చేశారు. అలాగే, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌కు ఆయన లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా మండలి ఛైర్మన్‌కు లేఖను పంపించారు. గత కొంత కాలంగా వైసిపికి దూరంగా ఉంటున్న జకియా ఖానం.. ఇవాళ ఉదయం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
కొద్దిసేపటిక్రితం బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న జకియా ఖానం..రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో భేటీ అయ్యారు. అనంతరం బిజెపి కండువా కప్పుకున్నారు. పురందేశ్వరీ ఆమెకు కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.