Friday, September 12, 2025

యూరియా దొరకలేదనే మనస్తాపంతో యువ రైతు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

యూరియా బస్తాలు దొరకపోవడంతో పంట చేను చేతికి రాదన్న మనస్థాపంతో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, ధనియాలపాడు పంచాయతీ పరిధిలోని సేవ్యాతండాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సేవ్యాతండాకు చెందిన కున్సోత్ యాకయ్య కుమారుడు సుమన్ (35) యూరియా బస్తాల కోసం సహకార సంఘం చుట్టూ తిరిగి వేశారిపోయాడు. అయినా దొరకపోవడంతో పంట చేను చేతికి రాదన్న మనోవ్యధతో గురువారం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతనిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద ఆకస్మిక మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News