Friday, July 18, 2025

పట్టపగలే నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

యువకుడిపై మూకుమ్మడిగా దాడిచేసి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటన వెల్గటూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గురువారం వెల్గటూర్ మండల కేంద్రం లోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద నడి రోడ్డుపై సల్లూరి మల్లేష్ పై దుండగులు ముకుమ్మడిగా దాడిచేసి కోటిలింగాల గ్రామ సమీపం లోని పాత వైన్స్ వెనుకకు తీసుకువెళ్లి కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం లోని కిషన్ రావుపేట గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ (35) అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం గత కొంత కాలంగా కొనసాగుతుంది.ఈ విషయం లో గ్రామం లో ఎన్నోసార్లు పంచాయతీలు

, పోలీసుస్టేషన్‌లో కేసులు అయినప్పటికి వారి ఇద్దరిలోనూ మార్పు రాలేదు.గురువారం ఉదయం మృతుడు అమ్మాయి ఇంటికి వెళ్లి గొడవకు దిగినట్లు సమాచారం. గతంలో యువకుడితో అమ్మాయి బంధువులు గొడవలకు దిగినట్లు సమాచారం. అమ్మాయి తండ్రిపై గతంలో ఎస్సి,ఎస్టీ కేసు నమోదు కావడంతో మూడు నెలలు జైలుకు వెళ్లివచ్చినట్లు బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో అమ్మాయి బంధువులు మృతుడిని వెంబడించి అతి దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న జగిత్యాల డిఎస్సి, ధర్మపురి సిఐ రాం నర్సింహారెడి, వెల్గటూర్ ఎస్సై ఉమాసాగర్, పోలీసులు చేరుకుని పంచనామా నిర్వహించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ్సాలి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News