Wednesday, September 3, 2025

హిమాయత్ సాగర్ లో దూకి యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. హిమాయత్ సాగర్ జలాశయం లోకి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ర్యాఫిడో బైక్  బుక్ చేసుకొని హిమాయత్ సాగర్ కు చేరుకున్న యువకుడు అందరూ చూస్తుండగా జలాశయం లోకి దూకాడు. ఈత రాకపోవడంతో క్షణాలలో నీటిలో మునిగిపోయి యువకుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడు ఉప్పర్ పల్లి హ్యాపీ హోమ్స్ కాలనీకి చెందిన ఆరిఫ్ గా  పోలీసులు గుర్తించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆరిఫ్ ఆసుపత్రి ఖర్చులు పెట్టుకొనే స్థోమత లేక బలవ్మరణం కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News