వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విషాదం చోటుచేసుకుంది. విగ్రహానికి కరెంట్ వైర్లు తగలడంతో విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాధ సంఘటన కామారెడ్డి జిల్లా, పాల్వంచ మండలం, ఆరేపల్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వినాయక చవితి ఉత్సవాలకు ముందస్తుగానే గణనాథులను యువత మండపాలకు చేరుస్తున్నారు. సిరిసిల్లకు చెందిన 15 మంది యువకులు ఆర్మూర్ పట్టణ పరిధిలోని పెర్కిట్‌లో వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి అక్కడి నుంచి ట్రాక్టర్‌లో తీసుకెళ్తుండగా పాల్వంచ మండలం, ఆరేపల్లి శివారులో గల కస్తూర్బా పాఠశాల సమీపంలో విగ్రహం వైర్లకు తగలడంతో ట్రాక్టర్‌లో ఉన్న ఇద్దరికి విద్యుత్ వైర్లు తగిలి కింద పడిపోయారు. వారిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా సిరిసిల్ల గోపాల్‌నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ (19) అనే యువకుడు మృతి చెందాడు. సుభాష్ నగర్‌కు చెందిన సాయికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గణేశ్ విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -