Wednesday, July 9, 2025

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

దండేపల్లి మండలం వందూరుగూడ గ్రామానికి చెందిన యువకుడు కోవ మహేందర్ (19) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తహసోద్దీన్ తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కోవ మహేందర్ కూలి పని చేసుకుంటూ మద్యానికి అలవాటు పడ్డాడు. గత కొద్ది రోజుల నుండి కడుపు నొప్పి రావడంతో ఆర్‌ఎంపీ వైద్యుల వద్ద వైద్య చికిత్సలు చేయించుకొని మందులు వాడుతున్నాడు. ఈ నెల 5న కడుపు నొప్పి అధికం కావడంతో మందులు తీసుకువస్తానని దండేపల్లికి వెళ్లాడు.

మధ్యాహ్న సమయంలో దండేపల్లికి సమీపంలోగల వాగు వద్ద గడ్డి మందు తాగి స్నేహితునికి ఫోన్ చేశాడు. విషయంను కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్దితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరుడు కోవ లక్ష్మణ్  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తహసోద్దీన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News