తలపై బండ రాయితో కొట్టి ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీగూడకు చెందిన మహ్మద్ ఖబులా అలియాస్ అడ్డు ఖాన్ సోఫా మేకర్‌గా పనిచేస్తున్నాడు. రాహుత్ హోటల్ సమీపంలోని కిషన్ నగర్‌లోని సందులో మహ్మద్ ఖబులా స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నాడు. ఈ సమయంలోనే అక్కడికి వచ్చిన కొంతమంది యువకులు బండరాయితో షేక్ ఖబులా తలపై కొట్టి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆసిఫ్ నగర్ ఇన్స్‌స్పెక్టర్ మల్లేష్, ఎసిపి హత్య స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆసిఫ్‌నగర్ పోలీసులు తెలిపారు.