Thursday, July 31, 2025

శంషాబాద్ లో యువతి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/శంషాబాద్: కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా పనిమీద బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న యువతి అదృశ్యమైన సంఘటన శంషాబాద్ పెద్ద షాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ గ్రామానికి చెందిన ఆవుల దర్శన్, కూతురు మాలతి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. తండ్రి ఆవుల దర్శన్ మంగళవారం నాడు ఉదయం ఏడు గంటలకు పని నిమిత్తం బయటకు వెళ్ళాడు.

అదే రోజు ఉదయం 10:30 గంటలకు అతని భార్య కొడుకు ఇద్దరూ కలిసి పొలానికి వెళ్లారని ఆ సమయంలో కూతురు మాలతి ఇంట్లోనే ఉందని అనంతరం కొడుకు భార్య ఇంటికి వచ్చేసరికి కూతురు ఇంట్లో కనబడటం లేదని వెంటనే చుట్టుపక్కల ఇళ్లలో బంధువుల ఇళ్లలో వెతికిన తమ కూతురు మాలతి ఆచూకీ లభించలేదని, తమ కూతురు ఐదు అడుగుల పొడవు నలుపు రంగు అదే విధంగా ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు తెలుపు చారల టీ షర్ట్ మరియు నల్ల ప్యాంటు ధరించి ఉందని తెలుగు భాషలో మాట్లాడుతుందని తెలిపారు. తమ కూతురి ఆచూకీ కనుక్కొని తమకు తెలుపాలని చట్టరీత్య కావాల్సిన చర్యలు తీసుకొని విచారణ చేయాలని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News