Tuesday, September 16, 2025

వైద్యం వికటించి యువతి మృతి

- Advertisement -
- Advertisement -

నాచారంలోని సత్య లాప్రోస్కోపిక్ హాస్పిటల్ లో వైద్యం వికటించి శైలేజ (22) అనే యువతి మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యాదాద్రి జిల్లా సూళ్లూరు గ్రామానికి చెందిన శైలజ అనే యువతి కడుపు నొప్పితో వస్తే అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఆ యువతి ప్రాణాల మీదకు తెచ్చారు. అపెండిక్స్ ఆపరేషన్ వికటించడంతో ఆసుపత్రి యాజమాన్యం గత్యంతరం లేక వేరే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దాంతో సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శైలజ మృతి చెందింది. సత్య లాప్రోస్కోపిక్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ అమ్మాయి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలు బంధువులు ఆసుపత్రి ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. తమ అమ్మాయి మృతికి కారణమైన ఆసుపత్రికి సీజ్ చేసి డాక్టర్ పై క్రిమినస్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News