ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’ (Junior) తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ డివోపీగా పని చేస్తున్నారు. ఈ సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “డైరెక్టర్ రాధాకృష్ణ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. మంచి ప్రొడక్షన్ హౌస్, టెక్నికల్ టీం కూడా చాలా బా గుంది. అలా ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. కొత్తవారిని పరిచయం చేసినప్పుడు ఫ్యామిలీ డ్రామా జానర్‌కి వెళ్ళ రు. డాన్సులు, ఫైట్లు ఉంటే చాలు అనుకుంటారు.
కానీ ఈ సినిమాలో బలమైన భావోద్వేగం ఉంది. కొత్త హీరో ఇలాంటి ఛాలెంజ్ తీసుకొని చేయడం అనేది నాకు చాలా నచ్చింది. -కిరీటి చాలా హార్డ్ వర్కర్. (Kiriti hard worker) చాలా అద్భుతమైన డాన్సర్. యాక్షన్ చాలా బాగా చేస్తాడు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. -ఈ సినిమా పాటలు జనాలకి నచ్చాయి. వైరల్ వయ్యారి పాటలో కిరీటి, శ్రీలీల డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ట్రైలర్ కూడా బాగా నచ్చింది. కచ్చితంగా సినిమాని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో డిఫరెంట్ జెనీలియాని చూస్తారు. ఆమె పాత్ర, నటన సరికొత్తగా ఉంటుంది. ఆడియన్స్ చాలా సర్‌ప్రైజ్ అవుతారు. డైరెక్టర్ రాధాకృష్ణ చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ఆయనకు ఏం కావాలో చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ చెప్పిన విధానం తీసిన విధానం నాకు చాలా నచ్చింది. ‘జూనియర్’ మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఇక ప్రస్తుతం -స్వయంభు సినిమా చేస్తున్నాను. అది బహుబలి లాంటి జోనరు. రాజులనాటి కథ. అలాగే ఇండియన్ హౌస్ సినిమా చేస్తున్నాను”అని అన్నారు.