ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’ తో (Junior) హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ “జూనియర్ టీజర్, ట్రైలర్,పాటలు చూశాను.
కిరీటి చాలా అద్భుతంగా డాన్స్ చేశాడు. తన నటన చాలా బాగుంది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో కిరీటి మాట్లాడుతూ (Hero Kiriti speaking)“డైరెక్టర్ రాధాకృష్ణ ఈ సినిమా కోసం మూడేళ్లు అంకితభావంతో పనిచేశారు. జెనీలియా 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ స్క్రీన్‌పై కంబ్యాక్ ఇస్తున్నారు. శ్రీలీల బాగా నటించారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాలి జనార్దన్ రెడ్డి, రవిచంద్రన్, శ్రీలీల, జెనీలియా, రాధా కృష్ణ, సెంథిల్ కుమార్ పాల్గొన్నారు.