Friday, July 18, 2025

పైసా వసూల్ మూవీ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’(Junior) తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా జెనీలియా కీలక పాత్ర పోషించింది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌లో ఎస్‌ఎస్ రాజమౌళి మాట్లాడుతూ “సాయి ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు మంచి కథతో ఒక చిన్న సినిమా చేస్తున్నారని అనుకున్నాను.

కానీ శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్, దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్, పీటర్… ఇలా ఒక్కొక్క ఎడిషన్ చూస్తుంటే ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే నటీనటులు టెక్నీషియన్స్ ఉంటారు అలా పెట్టుకుంటూ తీసుకెళ్లారు. చాలా పెద్ద సినిమా చేశారు. దీంతో ఈ సినిమాని ఫస్ట్ డే చూడాలనే ఆసక్తి కలిగింది. పైసా వసూల్ మూవీ ఇది”అని అన్నారు. హీరో కిరీటి మాట్లాడుతూ “రాధాకృష్ణ ఈ సినిమాతో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జెనీలియా 13 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసిన పీటర్ మాస్టర్, వెంకట్ మాస్టర్‌లకు థాంక్యూ”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెనీలియా, శ్రీలీల, రాధా కృష్ణ, సాయి కొర్రపాటి, దేవిశ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్, పీటర్ హెయిన్స్, సందీప్ రాజ్, వైవా హర్ష తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News