Saturday, May 3, 2025

ఎన్టీఆర్ జిల్లాలో యూట్యూబర్ హత్య?

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్టం ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలంలో యూట్యూబర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22) అనే యువతి యూట్యూబ్ లో వీడియోలు చేస్తోంది. మధుమతి అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు పలు ఆరోపణలు చేస్తున్నారు. తెల్లదేవరపల్లికి చెందిన ప్రతాప్‌తో తమ కుమార్తెకు వివాహేతర సంబంధం ఉందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ప్రతాప్ తమ కూతురిని  తీసుకెళ్లి ఉరి వేసి చంపేశాడని మధుమతి తల్లిదండ్రులు ఆరోపిస్త్తున్నారు. ప్రతాప్‌ను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుతన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News