Thursday, May 1, 2025

ఎపిసిసి చీఫ్ షర్మిల అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ప్రధాని పర్యటన దృష్ట్యా అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం పర్యటనకు వెళ్లాలని ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిల భావిం చారు. రాజధానిపై కాంగ్రెస్ కార్యాచరణ కోసం ఓ కమిటీని వేశారు. అక్కడి పరిస్థితుల పరిశీలనకు వెళ్లేందుకు ప్రయత్నించగా ప్రధాని పర్యటన దృష్టిలో ఉంచుకుని పోలీసులు అనుమతి నిరాకరించారు. తొలుత గన్నవరంలోని నివాసం వద్ద హౌస్ అరెస్టు చేశారు. గన్నవరం నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి బయటకు రానీయకుండా నిలువరించారు. మధ్యాహ్నం వరకు గన్నవరంలోని నివాసంలోనే షర్మిల ఉండిపో యారు. ఈ క్రమంలో తనను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని ఎలా ఉందో చూడటం తప్పా లేక అమరావతి మీద పరిశోధన చేయాలని అనుకోవడం తప్పా అని ప్రశ్నించారు.

మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆంధ్ర రత్నా భవన్ వద్దకు షర్మిల వచ్చారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో బిజెవైఎం కార్యకర్తలు ఎపిసిసి కార్యాలయం లోకి దూసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై గుడ్లతో దాడి చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెవైఎం కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకున్నా చాలా సేపటి వరకు ఉద్రిక్తత తగ్గలేదు. బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ నేతృత్వంలో ఎపిసిసి కార్యాలయాన్ని ముట్టడి చేయడంతో పోలీసులు బిజెవైఎం నేతలను అదుపులోకి తీసుకు న్నారు. అనంతరం పిసిసి కార్యాలయంలోనే షర్మిల నిరసనదీక్షకు దిగారు. ప్రధాని పర్యటన చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ అన్నట్లుగా ఉందని విమర్శిం చారు. అప్పులతో రాజధాని కట్టడం ఏంటని రాజధానికి రూ.లక్షా 50 వేల కోట్లు నిధులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యాల యంపై బిజెవైఎం నాయకులు దాడికి ప్రయత్నించారంటూ షర్మిల తీవ్రంగా ప్రతిస్పందించారు.

రాష్ట్రంలో వైసిపి ఉన్నా, కూటమి ఉన్నా అధికార పెత్తనం మాత్రం బిజెపిదేనని టిడిపి, జనసేన, వైసిపి నాయకులు ఎలాగూ ప్రధానిని పశ్నించరని తాము మోడీ మోసాలను నిలదీస్తే తనను టార్గె ట్ చేసి దాడి చేయిస్తారా? అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో పర్యటనకు తాము అనుమతించకపోయినా ఏదో ఓ రూపంలో అక్కడికి వెళ్లాలనే ఉద్దేశ్యంతో షర్మిల ఉన్నట్లు భావిస్తోన్న పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. తాను ఈ విషయాన్ని సిఎం చంద్రబాబు వద్దే తేలు స్తానంటూ కార్యాలయం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు షర్మిలను అరెస్టు చేసి గన్నవరం విమానాశ్రయానికి తీసు కెళ్లారు. అక్కడి నుంచి షర్మిలను హైదరాబాద్ పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News