Thursday, September 18, 2025

గవర్నర్ తమిళిసైకి లేఖ రాసిన వైఎస్ షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వైఎస్ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం లేఖ రాశారు. టిఎస్‌పిఎస్‌సి బోర్డు రద్దు కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని వినతి పత్రం అందజేశారు. కొత్త బోర్డు వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని గవర్నర్ ను షర్మిల కోరారు. సిట్ పనితీరు నమ్మశక్యంగా లేదని ఆమె పేర్కొన్నారు. సూత్రధారులను తప్పించే విధంగా దర్యాప్తు సాగుతోందని ఆరోపించారు. ప్రశ్నపత్రం లీకేజీ వెనక బోర్డు ఛైర్మెన్, సభ్యుల హస్తం ఉందని షర్మిల తెలిపారు. లీక్ వెనక ఉద్యోగుల నుంచి మంత్రుల వరకు హస్తముందని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో పారదర్శకంగా నియామకాలు జరిపించి, నిరుద్యోగులకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News