Saturday, May 3, 2025

ఇడుపాలపాయ ట్రిపుల్ ఐటిలో విషాదం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్‌ఆర్ కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్ భవనం పైనుంచి దూకి సురేఖ అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తీవ్రగాయాలతో రిమ్స్‌లో చికిత్స పొందుతూ సదరు విద్యార్థిని చనిపోయింది. ప్రస్తుతం సదరు విద్యార్థిని ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సురేఖ స్వస్థలం ప్రకాశం జిల్లా జంగంగుంట్ల అని పోలీసులు తెలిపారు. విద్యార్థిని మృతికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News