- Advertisement -
అమరావతి: బిజెపికి వైసిపి పార్టీ బిటీమ్ అని నిజ నిర్థారణ జరిగిందని ఎపి పిసిసి అధ్యక్షురాలు షర్మిల (Sharmila) తెలిపారు. బిజెపి ముందు వైసిపి ముసుగు మళ్లీ తొలగించిందని అన్నారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ..ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డియే అభ్యర్థికి మద్ధతుతో మరోసారి తేటతెల్లమైందని, రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది కూడా నరేంద్ర మోడీ పక్షమే తేలిందని ఎద్దేవా చేశారు. అవినీతి కేసులకు భయపడి బిజెపికి వైసిపి మళ్లీ దాసోహం అంటోందని మండిపడ్డారు. ఓటు చోరితో (vote theft) రాజ్యాంగం ఖూనీ అయ్యేది వైసిపికి కనిపించడం లేదా? అని విమర్శించారు. ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడు సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే మద్దతు ఇవ్వలేరా?, తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటో వైసిపి చెప్పాలని షర్మిల నిలదీశారు.
- Advertisement -