Sunday, July 20, 2025

మద్యం కుంభకోణంలో మిథున్‌రెడ్డి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్న ఆయనను శనివారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో సు మారు 7 గంటలపాటు విచారించిన అనంత రం ఎంపీని అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చే సినట్లు బంధువులకు సిట్ అధికారులు సమాచారమిచ్చారు. ఇప్పటికే మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News