హైదరాబాద్: భారతదేశంలో అపరిమిత ఆనందం కోసం ఆహరం అనే భావనతో మార్గదర్శక కేఫ్ లను నిర్వహిస్తోన్న యమ్మీ బీ, హైదరాబాద్‌లోని ఖాజాగూడలో తమ సరికొత్త స్టోర్‌ను ప్రారంభించింది. శుభ్రమైన, పారదర్శక పదార్థాలతో తయారు చేసిన డెజర్ట్‌లను అందించటంలో నిబద్ధతకు పేరుగాంచిన యమ్మీ బీ, చక్కెర, మైదా, గ్లూటెన్ మరియు నిల్వకారకాలు లేని తీపి రుచులను అందిస్తోంది. 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఖాజాగూడ స్టోర్ సౌకర్యవంతమైన కౌంటర్లు, కస్టమర్‌లు విశ్రాంతి తీసుకోవడానికి ఆహ్వానించే లేఅవుట్ తో ప్రశాంతమైన, స్వాగతించే వాతావరణాన్ని సృష్టించడానికి ఉంది. పదార్థాల ఎంపిక నుండి సీటింగ్ ఏర్పాట్ల వరకు సూక్ష్మ అంశాలు, ఆహారం, పారదర్శక విధానంపై దృష్టి సారించిన కేఫ్ గొలుసుగా యమ్మీ బీ గుర్తింపుకు మద్దతు ఇస్తాయి.
ఈ స్టోర్ ప్రారంభం గురించి యమ్మీ బీ వ్యవస్థాపకుడు సందీప్ జంగాల మాట్లాడుతూ “మనసుకు ఆనందం కలిగించే ఆహారం తినడమంటే ఆరోగ్యపరంగా రాజీ పడాల్సిన అవసరం లేదని మేము ఎల్లప్పుడూ నమ్ముతున్నాము. ఖాజాగూడలోని ఈ కొత్త ప్రాంగణం ఆ నమ్మకమును మరింత మందికి చేరువ చేయటానికి మాకు వీలు కల్పిస్తుంది; సంతృప్తికరంగా ఉండే, శుభ్రమైన పదార్థాలతో తయారు చేయబడిన, ఆహ్లాదకరమైన వాతావరణంలో వడ్డించే డెజర్ట్‌లు అందరికీ ఆనందం కలిగిస్తాయి” అని అన్నారు. ఈ కొత్త స్టోర్ యమ్మీ బీ స్థిరమైన, విస్తరణ వ్యూహంలో భాగం, ఖజాగూడ స్టోర్ డెజర్ట్ ప్రియులను, సాధారణ సందర్శకులను యమ్మీ బీ యొక్క సిగ్నేచర్ రుచులను ఆస్వాదించటానికి ఆహ్వానిస్తుంది.