- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తుపై దాఖలు చేసిన పిటిషన్‌ను వైసిపి ఎంపి వైవి సుబ్బారెడ్డి ఉపసంహరించుకున్నా రు. కల్తీ నెయ్యి కేసులో తనను అక్రమంగా ఇరికించాలని ఎపి ప్రభుత్వం చూస్తోందంటూ సుప్రీంలో సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. దీని పైన సిజెఐ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేసింది. కల్తీ నెయ్యి కేసుపై నియమించిన సిట్ దర్యాప్తును సుప్రీం కోర్టే పర్యవేక్షించాలని కూడా పిటీషన్‌లో సుబ్బారెడ్డి కోరారు. అయితే విచారణ సందర్భంగా ఈ అంశంపై ఇతర న్యాయ మార్గాలను పరిశీలిస్తున్నామని, పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సుబ్బారెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. సుబ్బారెడ్డి అభ్యర్ధనతో పిటీషన్ ఉపసంహరణకు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
- Advertisement -