Friday, July 11, 2025

ఎసిబి వలలో జహీరాబాద్ నిమ్జ్ అధికారులు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)కు రెండు పెద్ద అవినీతి తిమింగళాలు చిక్కాయి. గురువారం జహీరాబాద్ లోని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మానుఫ్యాక్చరింగ్‌ జోన్‌(నిమ్జ్) అధికారులు ఎసిబి వలలో పడ్డారు. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీశ్ లు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. భూసేకరణ పరిహారం చెక్కులు ఇచ్చేందుకు లంచం అధికారులు డిమాండ్ చేయడంతో బాధితరులు ఎసిబిని ఆశ్రయించారు. దీంతో పక్క ప్లాన్ ప్రకారం.. బాధితుల నుంచి 65 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా అధికారులు రాజు, సతీశ్ లను ఎసిబి పట్టుకుంది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎసిబి అధికారులు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News