Wednesday, April 30, 2025

ఫెయిల్ అవుతాననే భయంతో రిజల్ట్ రాకముందే.. టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంజుల అనే మహిళ చిన్న కుమారుడు సంజయ్ కుమార్(15).. వర్గల్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో పదవ తరగతి చదువుతున్నాడు. పరీక్షల అనంతరం సెలవులకు తన తల్లి దగ్గరికి వచ్చిన సంజయ్.. మూడు రోజుల్లో పరీక్ష ఫలితాలు వస్తాయని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి తాను పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో తన తల్లి ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్ కు  ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News