సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ కూలీ. (Coolie) కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఆసియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 14న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రుతి హసన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “కూలీ సినిమాలో -రజినీకాంత్‌తో కలిసి వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
-ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కు ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారని నమ్మకం ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు చాలా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో నేను సత్య రాజ్ అమ్మాయిగా కనిపిస్తాను. నాగార్జున, ఉపేంద్ర వంటి సూపర్ స్టార్స్‌తో ఒకే సినిమాలో పని చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఇది చాలా స్పెషల్ మూవీ. రజనీకాంత్ క్యారెక్టర్, నా క్యారెక్టర్‌తో తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ (Family Audience) కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో నాగార్జున తొలిసారిగా విలన్ క్యారెక్టర్ చేశారు. తెలుగు ఆడియన్స్ అందరు చాలా సర్ప్రైజ్ అవుతారు. లోకేష్ కనకరాజ్ చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. అమీర్‌తో కలిసి పనిచేయడం చాలా గొప్ప అనుభవాన్నిచ్చింది. -కూలీ ఫుల్ ఎంటర్టైనర్. చాలా అద్భుతమైన యాక్షన్ ఉంది. అలాగే మంచి కథ, భావోద్వేగాలు ఉంటాయి. కచ్చితంగా ఆడియన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు”అని అన్నారు.