Saturday, July 27, 2024

పన్నూ విషయంపై ఇండియాకు సిఐఎ చీఫ్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఖలీస్థానీ వేర్పాటు వాద వాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర విషయంపై అమెరికా అధ్యక్షులు బైడెన్ స్పందించారు. పన్నూన్ హత్యకు భారతీయ ఏజెంట్లు కుట్ర పన్నారనే విషయంపై నిజానిజాలు రాబట్టుకునేందుకు బైడెన్ ఇప్పుడు భారతదేశానికి తమ స్పై చీఫ్ విలియం బర్న్‌ను ఇండియాకు పంపించారు. ఆయన సిఐఎ డెరెక్టర్‌గా ఉన్నారు. పన్నూన్ ఇప్పుడు న్యూయార్క్‌లో ఉంటున్న అమెరికా పౌరుడు అయినందున,

అమెరికాలో ఆయన అంతానికి కుట్ర జరిగిందనే వార్తను అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. తమ దేశంలోని ఏ పౌరుడి భద్రత అయినా తమకు కీలకం అని బైడెన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ స్పై చీఫ్‌ను విషయాల ఆరాకు ఇండియాకు పంపించినట్లు వెల్లడైంది. భారత్‌కు చెందిన ఉన్నతాధికారులతో ప్రత్యేకించి రా , ఇతర నిఘా సంస్థలతో విషయం ప్రస్తావించేందుకు వీలుందని స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News