Monday, April 29, 2024

పిల్లల్ని కనండి..దేశాభిమానం చాటండి

- Advertisement -
- Advertisement -

మాస్కో : రష్యా జనాభాను పెంచడమే లక్షంగా పెట్టుకోవాలని, తిరిగి మునుపటిలాగా రష్యన్లు పెద్ద కుటుంబాలతో విస్తరించుకోవల్సి ఉందని దేశాధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ పిలుపు నిచ్చారు. వరల్డ్ రష్యన్ పీపుల్ కౌన్సిల్ సమావేశంలో పుతిన్ ప్రసంగించారు. ఇటీవలి కాలంలో రష్యన్ల జనాభా సంఖ్యను పరిశీలించుకుంటే ఆందోళన కల్గుతోందని , 1990 నుంచి జననాల రేటు పడిపోయిందని తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆరంభమైన నాటి నుంచి ఇప్పటికే మూడు లక్షల మందిని మనం కోల్పోయినట్లు చెప్పారు. తగ్గుతున్న జనాభా జాతీయ స్థాయి సమస్య అవుతోందన్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే మహిళలు తగు విధంగా స్పందించాల్సి ఉంటుంది. పెద్ద కుటుంబం అనేది మన పాతతరం అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని పాటించిన సత్సంప్రదాయం, ఇది మన నైతికత, మన సంప్రదాయాలను బలోపేతం చేస్తుంది.

మన అమ్మమ్మ నానమ్మలకు ఏకంగా ఎనిమిది తొమ్మిది మంది వరకూ సంతానం ఉండేది. దీనిని మనం కొంతలో కొంతైనా పాటించాల్సి ఉంది. పెద్ద కుటుంబం అనేది ప్రామాణికంగా మల్చుకోవల్సి ఉంది. లేకపోతే అది పలు అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరించారు. కుటుంబం అనేది కేవలం మన సమాజానికి ప్రతీక అనే అనుకోవద్దు, రష్యన్ల సంప్రదాయకపు విలువలు, పురాతన వైభవం కొనసాగించే ప్రాతిపదిక అవుతుందని పుతిన్ పిలుపు నిచ్చారు. పెద్ద కుటుంబాలతో కూడిన రష్యానే ప్రపంచంలో మనను బలోపేతం చేస్తుందన్నారు. ఉక్రెయిన్ యుద్ధంతో తలెత్తిన పరిణామాలతోనే పుతిన్ దేశ జనాభా విషయం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. లక్షలాది మంది పౌరులు చనిపోవడం, రష్యాను వేలాదిగా కార్మికులు ఉద్యోగులు వీడటంతో మానవ వనరుల సమస్యలు తలెత్తడంతో , ప్రపంచ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ దీనస్థితికి చేరుకోవడం వంటి పరిణామాలతో పుతిన్ దేశంలో పెద్ద సంతాన కుటుంబాల గురించి ఎలుగెత్తినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News