Wednesday, February 21, 2024

బిపర్‌జాయ్ తుపానుపై ప్రధాని మోడీ సమీక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని కచ్ తీరాన్ని గురువారం తాకనున్న బిపర్‌జాయ్ తుపానును ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పికె మిశ్రా, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, భూశాస్త్రాల కార్యదర్శి ఎం రవిచంద్రన్, జాతీయ విపత్తు నిర్శహణ సంస్థ సభ్యుడు కమల్ కిశోర్, భౠరత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు.

తుపాను సందర్భంగా జూన్ 15వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు కచ్, దేవ్‌భూమి, ద్వారక, పోర్బందర్, జాంనగర్, రాజ్‌కోట్, జునార్‌గఢ్, మోర్బిలో భారతీ వర్షాలు పడవచ్చని, గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు ప్రధానికి వివరించారు.

దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్ తీర ప్రాంతాలలో చేపల వేటను నిలిపివేయడం జరిగిందని, తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతోందని అధికారులు వివరించారు. సౌరాష్ట్ర, గుజరాత్ మధ్య తీరాలలో తీవ్ర స్థాయిలో తుపాను ముంచుకురావచ్చని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News