Wednesday, September 17, 2025

ప్రకృతి అందాలు ద్విగుణీకృతమయ్యేలా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి అందాలు ద్విగుణీకృతమయ్యేలా వీకెండ్‌లో నెటిజన్లను ఆహ్లాదపర్చే రీతిలో ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రకృతి ప్రేమికులను పలకరిస్తుంటారు. ‘హ్యాపీ సండే’ పేరిట వీకెండ్‌లో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రకృతితో ముడిపడి ఉన్న పక్షుల సమూహాలను, విన్యాసాలను తన కెమెరాలో నిక్షిప్తం చేస్తుంటారు.

ఆయా ప్రాంతాల్లో పక్షులను వీక్షిస్తూ వాటి విన్యాసాలను తన కెమెరాలో బంధించి ప్రకృతి ప్రేమికులను అలరించే విధంగా ఆ అరుదైన దృశ్యాలను తన ట్విట్టర్‌లో పొందుపరుస్తారు. ఈ దృశ్యాలు నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తాయనడంలో సందేహం లేదు.

Nature 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News