మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ మనువడు, మంత్రి కెటిఆర్ కుమారుడు హిమాన్షు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి విదితమే. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు అభ్యసించేందుకు వెళ్లిన హిమాన్షు ఎక్స్ (ట్విట్టర్)లో ఒక ఎమోషనల్ పోస్టు చేశారు. తన ఫ్యామిలీని మిస్ అవుతున్నట్టుగా పేర్కొన్నారు. తన ఫ్యామిలీతో ఉన్న చిత్రాలను షేర్ చేసిన హిమాన్షు “నేను వారిని ప్రతిరోజూ మిస్ అవుతున్నాను. ముఖ్యంగా తాతయ్యను మిస్ అవుతున్నాను” అని తన పోస్టులో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక, కెసిఆర్‌కు తన మనవడు హిమన్షు మీద అమితమైన ప్రేమ కనబరుస్తారనే సంగతి విదితమే. కొన్నిసార్లు తన పర్యటనల్లో హిమాన్షును కూడా తీసుకుని వెళ్లేవారు. హిమాన్షుకు కూడా తాత అంటే చాలా ప్రేమ ఉంది. తన తాత అంటే ఎంత ఇష్టమనేది హిమాన్షు పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇటీవల కూడా కెసిఆర్‌పై తన అభిమానాన్ని చాటుతూ హిమాన్షు ఓ పోస్టు చేశారు. పచ్చని పొలాల్లో కెసిఆర్ ఆకారంలో ఉన్న ఎఐ ఇల్యూషన్ ఫొటోను షేర్ చేసిన హిమాన్షు కొందరు తాము ఆరాధించే వ్యక్తులను ద్వీపాలలో చూస్తే మరికొందరు ఎడారుల్లో చూస్తారని కానీ తాను తెలంగాణలోని ప్రతి వ్యవసాయ క్షేత్రంలోనూ చూస్తానని పేర్కొన్నారు. ‘కెసిఆర్ వన్స్ అగైన్’ అని ట్యాగ్ కూడా జత చేశారు.
I miss them everyday
Especially Thathaya
pic.twitter.com/8RV7oVdY5B
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) October 5, 2023
Some people see their idols in islands, while others see them in deserts, but I see mine in every farm field of Telangana#KCROnceAgain pic.twitter.com/1u642YkSH9
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) September 30, 2023