Friday, April 19, 2024

టాప్ ర్యాంకర్లకు హెలికాప్టర్ విహారం

- Advertisement -
- Advertisement -

10th and 12th toppers helicopter ride in Chhattisgarh

రాయపూర్: రాష్ట్ర, జిల్లా స్థాయిలో 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన 125 మంది విద్యార్థులను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వినూత్న రీతిలో సత్కరించింది. రాయపూర్‌లో వారికి హెలికాప్టర్‌లో విహరించే అవకాశాన్ని కల్పించింది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చేసిన వాగ్దానం మేరకు 10, 12 తరగతి బోర్డు పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఏడు సీటర్ల హెలికాప్టర్‌లో విహరించే అవకాశాన్ని ప్రభుత్వాధికారులు కల్పించారు. అనంతరం వారంరినీ ఇక్కడి పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో సత్కరించారు. బోర్డు పరీక్షల్లో ప్రతిభను చాటిన విద్యార్థులను ఈ రకంగా వినూత్న రీతిలో సత్కరించడం రాష్ట్రంలో ఇదే మొదటిసారని ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో టాప్ 10 ర్యాంకర్లకు హెలికాప్టర్ విహారం ద్వారా సత్కరిస్తామని ముఖ్యమంత్రి బఘేల్ ఈ ఏడాది మేలో ప్రకటించారు. కాగా, హెలికాప్టర్‌లో తిరిగే అవకాశం కల్పించినందుకు టాప్ ర్యాంకర్లు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

10th and 12th toppers helicopter ride in Chhattisgarh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News