Thursday, August 28, 2025

11 నెలల్లో భారీగా పతనమైన విదేశీ మారక నిల్వలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఫిబ్రవరి10న ముగిసిన వారాంతంలో 8.3 బిలియన్ డాలర్లు తగ్గి 566.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత రిజర్వు బ్యాంకు శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023 జనవరి 6 నుంచి విదేశీ మారక నిల్వలు కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు క్షీణించడంతో వరుసగా రెండో వారం కూడా పతనమైంది. ఇది 7.1 బిలియన్ డాలర్లు పడిపోయి 500.59 బిలియన్ డాలర్లకు చేరింది.

ఫిబ్రవరి 10తో ముగిసిన వారంలో యూఎస్ ఉద్యోగాల డేటా, ఫెడరల్ రిజర్వ్ ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ కాలం వడ్డీ రేట్లను పెంచుతుందనే ఆందోళనలను రేకెత్తించడంతో డాలరు మారకంతో రూపాయి విలువ 0.8 శాతం నష్టపోయి 82.51 వద్ద ట్రేడయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News