Saturday, October 5, 2024

బస్సు ట్రక్కు ఢీ.. 12 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. యుపి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు హత్రాస్ జిల్లాలో ఆగ్రా అలీఘడ్ హైవేపై వెళ్లుతుండగా ట్రక్కులోకి దూసుకువెళ్లింది, మినీట్రక్కులో వెళ్లుతున్న వారిలో 12 మంది చనిపోగా, 16 మంది గాయపడ్డారని జిల్లా అధికారులు తెలిపారు. సమీప బంధువు ఇంట్లో జరిగిన శ్రాద్ధంలో పాల్గొని వీరు ట్రక్కులో సొంత గ్రామం సెవాలాకు తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. మృతులలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News